స్తోత్ర గీతము 1
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు – హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు (2)
రాజుల రాజా ప్రభువుల ప్రభువా – రానైయున్నవాడా (2)
మహిమా మహిమా ఆ యేసుకే – మహిమా మహిమా మన యేసుకే (2)
||హల్లెలూయ||
సూర్యునిలో చంద్రునిలో – తారలలో ఆకాశములో (2)
మహిమా మహిమా ఆ యేసుకే – మహిమా మహిమా మన యేసుకే (2)
||హల్లెలూయ||
ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడా – యుగయుగముల నిత్యుడా (2)
మహిమా మహిమా ఆ యేసుకే – మహిమా మహిమా మన యేసుకే (2)
||హల్లెలూయ||
కొండలలో లోయలలో – జీవులలో ఆ జలములలో (2)
మహిమా మహిమా ఆ యేసుకే – మహిమా మహిమా మన యేసుకే (2)
||హల్లెలూయ||
స్తోత్ర గీతము 2
హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (4)
యేసయ్యా నీవే నా రక్షకుడవు
యేసయ్యా నీవే నా సృష్టికర్తవు
దరి చేర్చి ఆదరించుమా
ఓ యేసయ్యా… దరి చేర్చి ఆదరించుమా
వి ప్రెయిస్ యు అండ్ వర్షిప్ యు
ఆల్మైటీ గాడ్.. ప్రైస్ యు అండ్ వర్షిప్ యు
హాల్లేలూయా ఆమెన్
ఓ యేసయ్యా.. ఆమెన్ హాల్లేలూయా
పరిశుద్ధ తండ్రి ప్రేమా స్వరూపివి
సర్వాధికారివి.. ఓ యేసయ్యా (2)
కరుణించి కాపాడుమా
ఓ యేసయ్యా.. కరుణించి కాపాడుమా (2)
||హల్లెలూయా||
స్తుతులకు పాత్రుడా – స్తోత్రించి కీర్తింతున్
కొనియాడి పొగడెదన్.. ఓ యేసయ్యా (2)
కృప చూపి నడిపించుమా
ఓ యేసయ్యా.. కృప చూపి నడిపించుమా (2)
||హల్లెలూయా||
స్తోత్ర గీతము 3
హోసన్నా హోసన్నా
హోసన్నా మహోన్నతుడు
దేవా నీ నామము ఉన్నత నామము
కృతజ్ఞత స్తుతులు నీకే
ప్రభావము రారాజుకే
కీర్తి కీర్తి
కీర్తి రారాజుకే
దేవా నీ నామము ఉన్నత నామము
కృతజ్ఞత స్తుతులు నీకే
ప్రభావము రారాజుకే
మహిమ మహిమ
మహిమ రారాజుకే
దేవా నీ నామము ఉన్నత నామము
కృతజ్ఞత స్తుతులు నీకే
ప్రభావము రారాజుకే
ఆరాధన వర్తమానము
మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని౹ ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి –జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలురాజు స్తుతింపబడునుగాక అని కేకలువేసిరి.సీయోను కుమారీ, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిదపిల్లమీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడినప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దానిమీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయననుగూర్చి వ్రాయబడెననియు, వారాయనకు వాటినిచేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి.౹ -యోహాను 12:12-16
ఈ ప్రవచనము ముందే యేసును గూర్చి చెప్పబడింది. అక్కడ ఆ జనులు యేసు వస్తున్నాడు అని తెలుసుకుని వారు కేకలు వేసి ప్రభువును ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే, వారు యేసు లాజరును లేపిన సంగతి తెలుసుకుని ఆయనను మహిమపరిచారు. అయితే సత్యము వారికి తెలియదు మరికొన్ని రోజులలో వారి పాపముల వెల సిలువలో చెల్లిస్తాడు అనే సంగతి వారికి తెలియదు. అయితే 2000 సంవత్సరముల ముందే జరిగిపోయినప్పటికీ, మనము ఆ జరిగిన సంగతి జ్ఞాపకము చేసుకొని మన పాపభారము యేసు క్రీస్తు సిలువ మరణము ద్వారా తొలగిపోయింది అని ప్రకటించి స్తుతించాలి. మనము సత్యము ఎరిగి ఆయనను ఆరాధిస్తే ఆయన మనసులో స్థానము పొందుకుంటాము.
యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నీవు కూడా ఆ సత్యమును ఎరిగి నీవు ప్రేమిస్తే, ఇరువురూ ఏకమైపోతారు. అది నీకున్న ఆధిక్యత!
ఆరాధన గీతము
ఇదిగో దేవా ఈ హృదయం
ఇదిగో దేవా ఈ మనసు
ఇదిగో దేవా ఈ దేహం
ఈ నీ అగ్నితో కాల్చుమా
పరిశుద్ధ అగ్నితో కాల్చుమా (2)
పనికిరాని తీగలున్నవి
ఫలమివ్వ అడ్డుచున్నవి (2)
ఫలియించే ఆశ నాకుంది
||ఈ నీ||
ఓ నా తోటమాలి
ఇంకో ఏడాది గడువు కావాలి (2)
ఫలియించే ఆశ నాకుంది
||ఈ నీ||
వారము కొరకైన వాక్యము
సత్యమును గ్రహించమని వాక్యము పదే పదే మనకు బోధిస్తుంది. సత్యమును గ్రహించినట్టయితే మన జీవితము అద్భుతముగా మార్చబడుతుంది. మన ప్రయాసంతా ఈ జీవితము కొరకే. దానికొరకే అనేకమైన ఆలోచనలు, ప్రయత్నాలు, యుక్తులు, కుయుక్తులూను. అయితే ఈ లోకము వున్న రీతిగా మనము ఉండకూడదు. మన జీవితము సత్యమును ఆధారము చేసుకొని ఉండాలి. ఆ దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఉద్దేశ్యము ఏమిటో నీవు ఎరిగి ఉంటే, నీవు జీవించే విధానమే మారిపోతుంది.
వాక్యము సత్యమై ఉన్నది, ఆ సత్యమును మనము గ్రహించాలి.
ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి –నీవును ఈ నీ దినమందైనను సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనినయెడల నీకెంతో మేలు; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడియున్నవి. -లూకా 19:41-42
నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు అని దేవుడు దుఃఖపడుతున్నాడు అని వాక్యము తెలియచేస్తుంది. మన జీవితము ఎంతో విలువైనది అనే సంగతి మనము ఎరిగి ఉండాలి అని దేవుని ఆశ. అనేకసార్లు మన జీవితములో కోపము వచ్చిన సందర్భములలో జీవితాన్ని శపించుకునే స్థితిలోకి వెళ్ళిపోతాము. అందుకే మన విశ్వాసము పరీక్షినబడే సమయములో మనము చాల ఓపిక కలిగి ఉండాలి.
నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచునుండు వారలారా, నా మాట వినుడి మీరు ఏ బండనుండి చెక్కబడితిరో దాని ఆలో చించుడి మీరు ఏ గుంటనుండి తవ్వబడితిరో దాని ఆలో చించుడి -యెషయా 51:1
దేవునిని అంగీకరించినవారు నీతిమంతులుగా తీర్చబడినవారు. అయితే మన ఈ ఐడెంటిటీ మర్చిపోకూడదు. ఒకవేళ మర్చిపోతే జరిగేది-
(ప్రభువు) నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టు గట్టు కట్టి ముట్టడివేసి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నీలోనున్న నీ పిల్లలతోకూడ నిన్ను నేల కలిపి నీలో రాతిమీద రాయి నిలిచియుండ నియ్యని దినములు వచ్చునని చెప్పెను -లూకా 19:43-44
అయితే మనము సత్యమును ఎరిగిన వారిగా మనము ఉండాలి. దేవుడు ఇచ్చిన జీవితమును గూర్చి అనాలోచితముగా మనము మాట్లాడకూడదు, ఉండకూడదు. మనము పాపములోనే పుట్టినవారము.
అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే. -1 కొరింథీయులకు 10:4
ఎక్కడనుంచి మన జీవితము ఇవ్వబడింది అనేది మనము గ్రహించాలి. దేవుడు యేసు క్రీస్తు ప్రభువును బలిగా అర్పించి, నీ పాపములకు వెల చెల్లించి ని జీవితమును సమకూర్చాడు. యేసయ్య జీవితమును గూర్చి ఆలోచిస్తే, యేసయ్య దేవుని మాటకు లోబడినవాడుగా ఉన్నాడు. అనగా ఆజ్ఞను అతిక్రమించలేదు గనుక ఆజ్ఞానుసరణ జీవము గనుక ఆయన జీవమై ఉన్నాడు. మన జీవితము ఆయననుండి చెక్కబడినది గనుక, జీవము నుండి చెక్కబడింది. అందుకే యేసయ్య మాటలు జీవమును సమాధానముతో కూడినవై ఉన్నవి అని వాక్యము సెలవిస్తుంది. ఆ యేసయ్యను బట్టి మన జీవితములు కూడా జీవము గలిగి, సమాధానకరమైన జీవితములు అయి ఉన్నవి.
కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పునచేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధి మంతుని పోలియుండును. -మత్తయి 7:24
దేవుని యొక్క మాటల ప్రకారము నీవు నిలబడినప్పుడు నీవు బండమీద నిలబడ్డట్టే. ఏ పరిస్థితులు వచ్చినా సరే, నీవు దేవుని మాటలను బట్టి నిలబడితే, క్రీస్తు సర్వాధికారము కలిగినవాడు గనుక, ఆ క్రీస్తు అనే బండపై స్థిరముగా ఉంటావు.
ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు?౹ -రోమా 8:31
అనగా మనము బండ అయిన క్రీస్తులో నిలబడి ఉన్నప్పుడు, ఆయన ద్వారా నీ జీవితము అనుగ్రహించబడినది అని నమ్మి నిలబడినప్పుడు, దేవుడు నీ పక్షమున నిలబడతాడు. దేవుడే నీ పక్షమున ఉంటే, సర్వమూ నీ పక్షమున ఉన్నట్టే.
ఆయన ఆ బలాతిశయముచేత క్రీస్తును మృతులలోనుండి లేపి, సమస్తమైన ఆధిపత్యముకంటెను అధికారముకంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను, ఈ యుగమునందుమాత్రమే గాక రాబోవు యుగమునందును పేరుపొందిన ప్రతి నామముకంటెను, ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొనియున్నాడు. మరియు సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.౹ ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై యున్నది. -ఎఫెసీయులకు 1:20-23
సమస్తము యేసయ్య పాదముల క్రింద ఉన్నవి. మనము ఆ క్రీస్తును ఆధారముగా చేసుకొని నిలబడినవారము గనుక ఆ సమస్తమూ మన యెదుట ఉన్నట్టే. అందుకే మన జీవితము ఎంతో విలువైనది.
సౌలు ఇంకను ప్రభువుయొక్క శిష్యులను బెదరించుటయును హత్యచేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధానయాజకునియొద్దకు వెళ్లి౹ యీ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనినయెడల, వారిని బంధించి యెరూషలేమునకు తీసికొని వచ్చుటకు దమస్కులోని సమాజములవారికి పత్రికలిమ్మని అడిగెను.౹ అతడు ప్రయాణము చేయుచు దమస్కుదగ్గరకు వచ్చి నప్పుడు, అకస్మాత్తుగా ఆకాశమునుండి యొక వెలుగు అతనిచుట్టు ప్రకాశించెను.౹ అప్పుడతడు నేలమీదపడి –సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.౹ –ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన–నేను నీవు హింసించుచున్న యేసును;౹ -అపొస్తలుల కార్యములు 9:1-5
ఇక్కడ చూస్తే, సౌలు యేసును హింసించాడా? కానీ యేసయ్య – “నీవు హింసిస్తున్న యేసును” అని చెప్తున్నాడు. అయితే సంఘమును హింసించుట అనగా క్రీస్తును హింసించుటగా యేసయ్య చూస్తున్నాడు. మనము క్రీస్తు అనే బండమీద నేను నిలబడినప్పుడు, ఏ పరిస్థితి అయినా మనలను నష్టపరచుటకు ప్రయత్నిస్తే, క్రీస్తుకు నష్టము చేయుటకు ప్రయత్నించినట్టుగా యేసయ్య చూస్తున్నాడు. మనము వాక్యము ప్రకారముగా జీవించినప్పుడు క్రీస్తు అనే బండపై ఉన్నట్టే. అందుకే సమకూర్చబడిన తరువాత అదే పౌలు, “నన్ను బలపరచువాని యందు నేను సమస్తమునూ చెయ్యగలను” అని చెప్తున్నాడు.
ఏ గుంటనుండి తవ్వబడితిరో దాని ఆలోచించుడి – యెషయా 51:1
ఏ గుంటలోనుండి తవ్వబడ్డాము? “నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.౹ -యోహాను 4:14”.
దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు; గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹ -యోహాను 10:10
అనగా సమృద్ధియైన జీవముగలిగిన గుంటనుండి తీయబడిన నీ జీవితము కూడా సమృద్ధికరముగానే ఉంటుంది. ఒకవేళ నీలో జీవము తగ్గే పరిస్థితి వచ్చింది అంటే మరలా ఆ గుంటను బట్టి మరలా జీవము నింపబడవలసినదే. నీతిమంతునికి ఒక మార్గము మూయబడితే, ఏడు ద్వారములు తీయబడతాయి అనగా నీ ఆశ తీరి నీవు సంపూర్ణత అనుభవించేవరకు నీ దేవుడు నీ కొరకు మార్గములు తెరిచేవాడుగా ఉన్నాడు.
కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;౹ -2 కొరింథీయులకు 5:17
అనగా ఎవడైననూ క్రీస్తు అనే బండపై నిలబడి ఉన్నట్టయితే, వాడి జీవితములో నూతన సృష్టి జరుగుతుంది. అనగా నీ పక్షమున నూతన క్రియ జరిగించేవాడుగా ఉంటాడు. మన జీవితము యొక్క విలువ తరగనటువంటిది. మరొకలా చూస్తే, క్రీస్తు జ్ఞానము సంపాదించిన కొలదీ, వాడి విలువ దినదినమూ పెరుగుతుంది. అందుకే, “ఆలోచించు” అని వాక్యము చెప్తుంది. నీవు ఆలోచించినపుడు నీవు గ్రహిస్తావు.
మనకు ఇవ్వబడిన జీవితాన్ని కాపాడుకోవాలి. అనగా వాక్యము అవును అంటే అవును, కాదంటే కాదు అనే విధానములో జీవించాలి. వాక్యము నెరవేరునట్టుగా నీ జీవితాన్ని సరిజేసుకోవాలి.