హోం

పాస్టర్. ఎస్. రాజ్ కమల్ గారు

వ్యవస్థాపకులు

దేవుని పిలుపుకు లోబడి, జీసస్ కేర్స్ యూ మినిస్ట్రీస్ ను ప్రారంభించారు. సంఘ కాపరిగా మరియు ప్రవక్తగా విశ్వాసులను బలపరిచే బాధ్యత ప్రార్థనా పూర్వకంగా, ప్రభువుకు నమ్మకంగా చేయుచున్నారు.

పరిచర్యలు

ఆదివారం ఆరాధన

ప్రతీ ఆదివారం రెండు ఆరాధన పరిచర్యలు జరుగును. మొదటి పరిచర్య విశాఖపట్నంలో, రెండవ పరిచర్య రాజమండ్రిలో జరుగును. దేవుని పేరట ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.

సూపర్ నాచురల్ సర్వీస్

సూపర్ నాచురల్ సర్వీస్ లో ఒక విశ్వాసికి తన జీవితంలోని అనేక పరిస్థితుల నుండి ప్రభువు ఆశ్చర్యకరమైన విడుదల అనుగ్రహించును. అనేకులు ఈ పరిచర్యద్వార విడుదలపొందుకుని ప్రభువును మహిమపరుస్తున్నారు.

ఆర్ధిక విడుదల పరిచర్య

ఆర్ధిక విడుదల పరిచర్య ద్వారా ఒక విశ్వాసి జీవితంలో ఆర్ధికపరమైన పరిస్థితులలో వాక్యానుసారమైన విడుదల, హెచ్చరిక మరియు బోధ అందించబడును. జీవితంలోని ప్రతీ పరిస్థితికీ యేసుక్రీస్తునందు జవాబు ఉన్నది అని జీసస్ కేర్స్ యూ పరిచర్య ఖచ్చితంగా విశ్వసిస్తుంది.

మిరాకిల్ సర్వీస్

మిరాకిల్ సర్వీస్ అనేది ప్రభువు యోహను 5:5-9 లో బేతెస్ద కోనేటి వాక్యము ద్వారా ప్రత్యక్షపరిచిన పరిచర్య. ఇది నెలకొకసారి రాజమండ్రిలో జరుగును. అనేకులు ప్రభువు శక్తిని అనుభవించి ఆయనను దేవుడుగా తెలుసుకున్నారు మహిమపరుస్తున్నారు.

అన్ని పరిచర్యలు యూట్యూబ్ ఛానెల్ లో అందించబడును గనుక ఇక్కడ సబ్ స్క్రైబ్ చేసుకోండి